Anushka-Shetty Realtion With Cricketer
Anushka : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అనుష్క శెట్టి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 41 సంవత్సరాలు ఉన్న అనుష్క శెట్టి… హీరో నాగార్జున నటించిన సూపర్ మూవీ తో మన తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత మహానంది సినిమాలో నటించి అందరిని మెప్పించింది అనుష్క శెట్టి. ఇక 2006 సంవత్సరంలో ఏకంగా జక్కన్న సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.
రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాలో హీరోయిన్గా చేసి అనుష్క తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోని అగ్ర హీరోయిన్గా ఎదిగిపోయింది అనుష్క శెట్టి. ముఖ్యంగా 2009 సంవత్సరంలో అరుంధతి సినిమా చేసి చరిత్ర సృష్టించింది అనుష్క శెట్టి. లేడీ ఓరియంటెడ్ లో విజయశాంతి తర్వాత అనుష్క ఇలా చేయడం ఆమె రేంజ్ ను మరింత పెంచింది.

ఇది ఇలా ఉండగా, అనుష్క ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచ్లర్ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. అయితే టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ తో అనుష్క శెట్టి ఎఫైర్ పెట్టుకుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై అనుష్క మరియు ప్రభాస్ ఎలాంటి కామెంట్ చేయలేదు.
అయితే ప్రభాస్ కంటే ముందు టీమిండియా కు చెందిన క్రికెటర్ తో అనుష్క శెట్టి రిలేషన్ పెట్టుకుందట. అతనితో రిసార్టులకు కూడా వెళ్లేదట అనుష్క ( Anushka ). అతని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకుందట. అయితే ఇంట్లో తల్లిదండ్రులు ఆ సంబంధానికి ఒప్పుకోలేదట. దీంతో ఆ టీమ్ ఇండియా క్రికెటర్ను అనుష్క శెట్టి వదిలేసిందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కాగా ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో అనుష్క ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.