CM KCR Will Contest From Kamareddy
CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ప్రస్తుతం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారత రాష్ట్ర సమితిని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే వరుసగా అధికారులతో అటు పార్టీ నేతలతో… సమీక్షలు నిర్వహించి ప్రజల సమస్యలను తీర్చేందుకు కీలక ప్రణాళికలు వేస్తున్నారు సీఎం కేసీఆర్.
అలాగే తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మరియు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు వ్యూహాలు రచించారు సీఎం కేసీఆర్. ఇటు మైనారిటీలకు లక్ష ఆర్థిక సహాయం చేస్తూ ఇటీవలే కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అటు రైతుల రుణమాఫీ, చేనేత కార్మికులకు బీమా పథకాలు ఇలా ఎన్నో రకాల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీఎం కేసీఆర్.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న సీఎం కేసీఆర్… వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని సమాచారం అందుతోంది. ఈ విషయంపై కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు గంప గోవర్ధన్. ముఖ్యమంత్రి కెసిఆర్ ( CM KCR ) వందకు 100% కామారెడ్డి నుంచే పోటీ చేస్తారని ఆయన నిన్న అసెంబ్లీ ముందు మీడియాతో వెల్లడించారు.
తాను ఇప్పటికే మూడుసార్లు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ ను పోటీచేయాలని కోరినట్లు గంప గోవర్ధన్ వెల్లడించారు. ఒకవేళ సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఒక సామాన్య కార్యకర్తగా ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సొంత గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలోనే వస్తుందని కూడా గంప గోవర్ధన్ వెల్లడించారు. మరి వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారో త్వరలోనే క్లారిటీ రానుంది.