Ileana : మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..తండ్రి మాత్రం తెలియదు

Ileana D’Cruz
Ileana D’Cruz

Ileana D’Cruz welcomes a baby boy, introduces her son as Koa Phoenix Dolan

Ileana : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానాకు ఇప్పటికి మన తెలుగులో క్రేజ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో వచ్చిన దేవదాసు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇలియానా… ఆ తర్వాత ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది కూడా. పోకిరి లాంటి సినిమా చేసి తన క్రేజ్ మరింత పెంచుకుంది ఈ బ్యూటీ.

ఇక గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఇలియానా… ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే సినిమాలు చేసుకుంటూ తన లైఫ్ కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉండగా… గత కొన్ని రోజులుగా ఇలియానా ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలల కిందట… తాను ప్రెగ్నెంట్ అంటూ ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Ileana D’Cruz
Ileana D’Cruz

అలాగే పది రోజులకు ఒకసారి తన బేబీ బంప్ ఫోటోలను తరచూ షేర్ చేస్తూ.. అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది ఇలియానా. ఇక ఇలాంటి తరుణంలోనే తాజాగా తన ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఈ బ్యూటీ. తాను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది నటి ఇలియానా ( Ileana ). ఆగస్టు ఒకటో తేదీని తాను పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు స్పష్టం చేసింది.

ఈ మేరకు తన కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఇలియానా. అంతేకాదు కోవా ఫినిక్స్ డోలన్ అనే పేరును తన కొడుకుకు పెట్టినట్లు ఇలియానా చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడంలో తాను ఎంతో హ్యాపీగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కానీ తనకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరనే విషయంపై ఇంకా ఇలియానా క్లారిటీ ఇవ్వలేకపోయింది.