AP Government has a shock for Bhola Shankar Team
Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. అనవసరంగా ఏపీ ప్రభుత్వాన్ని గెలికేశారు. తన తమ్మున్ని కాపాడుకునేందుకు… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లారు. రెమ్యూనరేషన్ గురించి మీకేందుకు అంటూ చిరంజీవి రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. దీంతో..ఇప్పుడు చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ పై సందిగ్ధత నెలకొంది. రేపు ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే.. భోళాశంకర్ సినిమా టికెట్ రేట్ల పెంపు వివాదం చోటు చేసుకుంది.
ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమా బడ్జెట్ వంద కోట్లు, 20 శాతం సినిమా షూటింగ్ ఏపీలో జరగాల్సి ఉంటుందని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తరుణంలోనే.. సినిమా బడ్జెట్ 101 కోట్లు అని భోళాశంకర్ నిర్మాతలు లేఖ కూడా ఇచ్చారు. కానీ బడ్జెట్ ఖర్చుకు సంబంధించిన సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించలేదు భోళాశంకర్ నిర్మాతలు. 20 శాతం షూటింగ్ కు సంబంధించి కూడా ఆధారాలు భోళాశంకర్ సినిమా టీం సమర్పించలేదు.

సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా ఈ నెల 2వ తేదీన కోరింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఈ నెల 2వ తేదీన టికెట్ల పెంపు కోరుతూ దరఖాస్తు చేసుకుంది భోళాశంకర్ చిత్ర బృందం. భోళాశంకర్ సినిమా యూనిట్ క్లెయిమ్ చేసుకున్న బడ్జెట్ కు సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నస్, ఆడిట్ నివేదిక ఇవ్వలేదు భోళాశంకర్ చిత్ర యూనిట్. ఈ తరుణంలోనే..టీడీఎస్, జీఎస్టీ రిటర్న్ రిపోర్ట్ లను సమర్పించాలని కోరింది ఏపీ ప్రభుత్వం. అటు బ్యాంకు స్టేట్ మెంట్లు, ఖర్చుకు సంబంధించిన ఇన్వాయిస్‌లను సమర్పించలేదు భోళాశంకర్ ( Bhola Shankar ) సినిమా బృందం.
25 రోజుల పాటు విశాఖ పోర్టు, అరకులో షూటింగ్ జరిగిందని పేర్కొన్న చిత్ర యూనిట్ దానికి సంబంధించిన ఆధారాలను అడిగింది ప్రభుత్వం. దీంతో సెన్సార్ బోర్డు సర్టిఫికెట్, సినిమా సినాప్సిస్ సైతం సమర్పించింది మూవీ టీం. మొత్తం 12 అంశాలకు సంబంధించిన వివరాలను అడిగింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఈ నెల 2వ తేదీన లేఖ రాసింది స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్‌డీ. కానీ ఇంత వరకు భోళాశంకర్ సినిమా బృందం స్పందించలేదు అంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. మరి దీనపై భోళాశంకర్ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.