Manchu Manoj : తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. ?

Manchu Manoj will become father

Manchu Manoj : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబం తర్వాత అంత క్రేజ్ ఉన్న కుటుంబం ఏదైనా ఉన్నది అంటే అది మంచు వారి కుటుంబమే. ఇండస్ట్రీలో అప్పుడు మరియు ఇప్పుడు మంచు కుటుంబం అంటే అందరికీ గౌరవమే. మంచు కుటుంబ సభ్యులు ఎంత రచ్చ చేసిన… వారికి ఇండస్ట్రీలోని పలువురు మర్యాదలు చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా మంచు వారి కుటుంబంలో ఓ సందడి వాతావరణం నెలకొంది.

మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు అయిన మంచు మనోజ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మార్చి నెలలో… మంచు మనోజ్ మరియు భూమా మౌనిక రెడ్డి వివాహం చాలా అట్టహాసంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. మంచు మనోజ్ కు ఇది రెండో వివాహమే. అటు మౌనిక రెడ్డికి కూడా రెండవ వివాహమే. వీరిద్దరూ చిన్నప్పటినుంచి మిత్రులు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తమ మొదటి బంధాలను తెంచుకున్న ఈ జంట… మార్చి మాసంలో రెండవ వివాహం చేసుకున్నారు. ఇక అప్పటికే తన మొదటి భర్త కారణంగా భూమా మౌనిక రెడ్డికి కుమారుడు కూడా పుట్టేశాడు. అయినప్పటికీ అతన్ని మంచు మనోజ్ తన కొడుకుగా భావించి… శివుడి బహుమతిగా స్వీకరించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి మంచు మనోజ్ మరియు భూమా మౌనిక రెడ్డిలతోనే ఉంటున్నాడు.

ఇక ఇలాంటి తరుణంలో మంచు మనోజ్ ( Manchu Manoj  ) మరియు భూమా మౌనిక రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. త్వరలోనే ఓ పండంటి బిడ్డకు మౌనిక రెడ్డి జన్మనివ్వనుందట. అయితే ఈ విషయాన్ని మంచు కుటుంబం అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఎంతమంది టాలీవుడ్ ప్రముఖుల సమాచారం కారణంగా… ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఏ మెరుపు వాస్తవం ఉందో మంచు కుటుంబం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.