Vaishnavi Chaitanya left From Job
Vaishnavi Chaitanya : ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బేబీ సినిమా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ సాధారణ చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ సినిమా… ఇప్పటికీ తన సత్తాను చాటుతోంది బాక్సాఫీస్ ముందు..! దాదాపు 100 కోట్ల కలెక్షన్లకు చెరువులో ఉంది బేబీ సినిమా. అయితే ఈ బేబీ సినిమాలో యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించి… ఇప్పుడు ఓ స్టార్ గా ఎదిగిపోయిందన్నమాట చాలా వాస్తవం.
ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో వైష్ణవి చైతన్యకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో వరుసగా ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 లో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తుండగా… ఈ భామ రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు సమాచారం అందుతోంది. అయితే ఇలాంటి తరుణంలో హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ బేబీ సినిమా వల్ల హీరోయిన్ వైష్ణవి చైతన్య చాలా నష్టపోయిందని తెలుస్తోంది. బేబీ సినిమా ఆఫర్ రాగానే… తన జాబు వదిలేసిందట ఈ బ్యూటీ. దీంతో వైష్ణవి చైతన్య కుటుంబం గడవడానికి చాలా కష్టమైందట. ఇక డబ్బులు లేకపోవడంతో అప్పులు కూడా చేశారట.
అయితే ఈ సినిమా మంచి విజయం అందుకున్న తర్వాత… ఆమెకు ఆఫర్లు రావడంతో ఇప్పుడిప్పుడే వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya ) కుటుంబం కుదురుకుంటుందట. జాబ్ పోయినా పర్లేదు అని… బేబీ సినిమా చేసిన వైష్ణవి చైతన్య పట్టుదలకు దర్శకుడు సాయి రాజేష్ కూడా ఫిదా అయిపోయాడట. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేసిందని ఆమెపై సాయి రాజేష్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.