Cm Jagan : మోడీకి కాదు..బైడెన్‌, పుతిన్‌ కు చెప్పుకో..పవన్‌ కు హెచ్చరిక !

Cm Jagan Team Counter To Pawan
Cm Jagan Team Counter To Pawan

Cm Jagan Team Counter To Pawan

Cm Jagan : నిన్న సీఎం జగన్‌ పై జనసేన పార్టీ ఛీప్‌ పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వంతో.. జగన్‌ ను ఓ ఆట ఆడుకుంటానని పవన్‌ కళ్యాణ్‌ నిన్న విశాఖ వేదికగా ప్రకటన చేశారు. అయితే… పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అమర్నాథ్ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఎవరికి భయం అని పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డాడు.

కేంద్రానికి కాకపోతే బైడన్ కో, పుతిన్ కో చెప్పుకో, మాకేం భయం లేదని కౌంటర్‌ ఇచ్చాడు ఏపీ మంత్రి అమర్నాథ్. కేంద్రం దగ్గర పవన్ కు ఉన్నది పలుకుబడి కాదు చంద్రబాబు దగ్గర రాబడి అంటూ సెటైర్లు పేల్చారు. వారాహి సభలో పవన్ ప్రసంగం విషం, విద్వేషం అహంకారంతో సాగిందని ఆగ్రహించారు ఏపీ మంత్రి అమర్నాథ్. సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించయాలనే అసూయ కనిపించిందని ఎద్దేవా చేశారు. జగన్ ను తిడితే నాయకుణ్ణి అయిపోతానని పవన్ భావిస్తున్నారని వెల్లడించారు ఏపీ మంత్రి అమర్నాథ్.

Cm Jagan Team  Counter To Pawan
Cm Jagan Team Counter To Pawan

వారాహీ లారీ మీద చేస్తున్న ప్రసంగాలు జగన్ నాయకత్వం ను విమర్శ చేయడం తప్ప పార్టీ సిద్దాంతం, విధానం చెప్పడం లేదని ఫైర్‌ అయ్యారు. దత్తత తండ్రి చంద్రబాబు దగ్గర బానిస బ్రతుకు బతుకుతున్న పవన్ ను చూసి జాలిపడుతున్నామని ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి అమర్నాథ్. వేమన చెప్పినట్టు….అల్పుడెపుడు పలుకు సూక్తి పవన్ కు సరిపోతుందని చురకలు అంటించారు.

యువరాజ్యం అధ్యక్షుడు నుంచి ఇప్పటి వరకు గత 15 ఏళ్లలో సిద్దాంతం, స్తిరత్వం, విధానం లేని వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు ఏపీ మంత్రి అమర్నాథ్. పొత్తులు పెట్టుకునే పార్టీలకు సైద్దాంతిక విభేదాలు ఉన్నాయి…సంసారం బీజేపీ తో సహజీవనం టీడీపీతో ఇదే పవన్ కళ్యాణ్ విధానం అంటూ చురకలు అంటించారు. వారాహి సభల్లో పార్టీ విధానం, అజెండా ప్రకటించి ఓటు వేయమని అడగడం మానేసి చంద్రబాబు స్కీం లో పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి అమర్నాథ్. పవన్ పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబు అంటూ సెటైర్లు పేల్చారు.