Rashmika Mandanna comments on heros
Rashmika Mandanna : మన దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తరాదిన కూడా మంచి జోరుని కొనసాగిస్తోంది కన్నడ బ్యూటీ రష్మికమందన్న. గత ఐదు సంవత్సరాలలో అనేక సినిమాలు చేసి ఇప్పటికి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా నిలిచింది ఈ బ్యూటీ. కెరీర్ ప్రారంభంలో చేలో అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న.
ఆ తర్వాత వెంటనే గీతగోవిందం అనే సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ రెండు సినిమాలు మంచి విజయం కావడంతో… తెలుగు చిత్ర పరిశ్రమంలో ఈ బ్యూటీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక రెండు సంవత్సరాల కిందట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందాన.

ముఖ్యంగా ఈ సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కు బాగా దగ్గరయిపోయింది. ఇక ప్రస్తుతం హీరోయిన్ రష్మిక మందాన చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో ప్రస్తుతం పుష్ప రెండవ భాగం సినిమా చేస్తోంది. ఆ తర్వాత సినిమాలేమీ లేవు.
ఇది ఇలా ఉండగా… హీరోయిన్ రష్మిక మందాన ( Rashmika Mandanna ) కు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండ, విజయ్ దళపతి మరియు షారుఖ్ ఖాన్ హీరోలలో ఎవరికి కిస్ ఇస్తామని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అయితే దీనికి ఈ హీరోయిన్ రష్మిక మందాన సింపుల్ ఆన్సర్ ఇచ్చింది. నేను ఆ ముగ్గురికి కిస్ ఇస్తానని స్పష్టం చేసింది హీరోయిన్ రష్మిక మందన్న