Varalaxmi Sarathkumar : వరలక్ష్మిపై మోజు పడ్డ తెలుగు దర్శకుడు !

Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar

Gopinchand Focus On Varalaxmi Sarathkumar

Varalaxmi Sarathkumar :  టాలీవుడ్ చిత్రపరిశ్రమంలో ఎంతోమంది నటీనటులు వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలా తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపిచ్చుకొని తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా తన సత్తా చాటుతోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. మన తెలుగు చిత్ర పరిశ్రమలో వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి పేరు ఉంది.

మొదటగా తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ… ఆ తర్వాత అక్కడ అవకాశాలు రాకపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే తెలుగులో హీరోయిన్గా కాకుండా లేడీ విలన్ గా తన సత్తాను చాటుతోంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే క్రాక్, నాంది, బాలయ్య హీరోగా చేసిన వీర సింహారెడ్డి సినిమాలలో అదరగొట్టింది నటి వరలక్ష్మి శరత్ కుమార్.

Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar

అయితే నటి వరలక్ష్మి శరత్ కుమార్ ను ప్రస్తుతం టాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు వెంటాడి వేధిస్తున్నాడట. ఈ సంఘటన ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆదర్శకుడు ఎవరో కాదు గోపీచంద్ మలినేని. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ మరియు వీరసింహారెడ్డి సినిమాలలో చాన్స్ కొట్టేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ( Varalaxmi Sarathkumar )… రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంది.

దీంతో వరలక్ష్మి శరత్ కుమార్కు మరో ఛాన్స్ ఇచ్చేందుకు దర్శకుడు వరలక్ష్మి శరత్ కుమార్ ఆతృతగా ఉన్నారట. ఇందులో భాగంగానే రవితేజ కొత్త సినిమాలో వరలక్ష్మికి ఛాన్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాడట గోపీచంద్ మలినేని. ఇక దీనికి వరలక్ష్మి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ ను దర్శకుడు గోపీచంద్ అస్సలు వదలడం లేదని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.