Samantha : అర గుండు కొట్టించుకున్న సమంత..ఫోటోలు వైరల్

Samantha latest Photos Viral

Samantha :  టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… అక్కినేని నాగచైతన్య మాజీ భార్య హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ అంతా కాదు. అయితే అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఓ భయంకరమైన వ్యాధితో హీరోయిన్ సమంత బాధపడుతూ ఉంది. మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధికి సమంతకు సోకింది. దీంతో ప్రస్తుతం హీరోయిన్ సమంత… ఆ వ్యాధి నయం అయ్యేందుకు చికిత్స తీసుకుంటుంది.

ఇక ఈ భయంకరమైన వ్యాధి నుంచి బయటపడేందుకు హాలిడేస్ ట్రిప్ కూడా ఎంజాయ్ చేస్తోంది. నిత్యం ఫ్రెండ్స్ తో జాలిగా గడిపేస్తోంది సమంత. అక్కడితో ఆగకుండా ఓ ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని కూడా హీరోయిన్ సమంత నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలకు కూడా బై బై చెప్పింది హీరోయిన్ సమంత. దీంతో సమంతకు దాదాపు 15 కోట్ల వరకు నష్టం వాటి లేనట్లు మొన్నటివరకు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొట్టింది.

ఇది ఇలా ఉండగా హీరోయిన్ సమంతకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. సమంత అర గుండుతో ఉన్న ఫోటోలను కొంతమంది సోషల్ మీడియాలో పెట్టి శునకానందం పొందుతున్నారు.

సమంత తల చుట్టూ వెంట్రుకలు తీసేసి.. అరగుండు లా ఉన్న ఫోటోలను… సెట్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలను చూసిన సమంత ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నాగచైతన్య ఫ్యాన్స్ పని అంటూ ఫైర్ అవుతున్నారు హీరోయిన్ సమంత ( Samantha ) ఫ్యాన్స్. ఒక మహిళను ఇలా చులకనగా చూపించడం అస్సలు మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు సమంత ఫ్యాన్స్.