Actress raasi Realtion with comedian
Actress raasi : మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసిన ఆ హీరోయిన్లు ఇప్పుడు చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ.. తమ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. అలా ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇందులో ఒకరు హీరోయిన్ రాశి.
అప్పట్లో సౌందర్య, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్లకు కూడా నటి రాశి గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతం నటి రాశి సీరియల్ చేస్తున్నప్పటికీ… అప్పట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి అందరిని మెప్పించింది ఈ బ్యూటీ. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా గతంలో నటించి.. ఓ రేంజ్ హీరోయిన్ గా మారిపోయింది.
బదిలీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రాశి.. మొదట్లో పెద్దగా సక్సెస్ అందుకోలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే లాంటి వరుస సినిమాలు హిట్ కావడంతో.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది నటి రాశి.
ఇది ఇలా ఉండగా తాజాగా నటి రాశి గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కెరీర్ లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్ కమెడియన్, అప్పటి స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ సరసన చాలా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అదే సమయంలో రాజేంద్రప్రసాద్ కు చాలా దగ్గర అయింది ఈ నటి రాశి ( Actress raasi ). అంతేకాదు వీరిద్దరూ పర్సనల్ గా హోటల్లో కలిసే వారట. ఈ విషయం రాజేంద్రప్రసాద్ భార్యకు తెలియడంతో వీరి బంధం అక్కడితో ముగిసిందట.