Rashmika Mandanna Missed a Chance
Rashmika Mandanna : అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీరిద్దరూ ప్రస్తుతం విడిపోయినప్పటికీ… జనాలందరూ ఇప్పటికీ వీరిద్దరూ భార్యాభర్తలుగానే ఉన్నట్లు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే టాలీవుడ్ లో ఒకప్పుడు అత్యంత క్యూట్ ఫ్యామిలీ వీరిద్దరిదే.
ఏం మాయ చేసావే సినిమాతో అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత ప్రేమలో పడి.. దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకొని 2017 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అయితే నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత… ఈ జంట ఎలాంటి కారణం చెప్పకుండానే విడాకులు తీసుకుంది.
అయితే అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఏం మాయ చేసావే, మనం, మజిలీ సినిమాలలో లవర్స్ గా అలాగే భార్యాభర్తలు గా నటించి అందరిని కనిపిందు చేశారు. వీటన్నిటిలో మజిలీ సినిమా ఈ జంటకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. మజిలీ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మజిలీ సినిమాలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత భార్య భర్తలుగా నటిస్తారు. దివ్యాంక కౌశిక్ సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది.
అయితే ఈ సినిమాలో మొదటగా అక్కినేని నాగచైతన్య భార్య పాత్రలో హీరోయిన్ రష్మిక మందానను అనుకున్నారట దర్శకుడు శివ నిర్వాణ. కానీ దానికి సమంత ఒప్పుకోలేదట. తానే ఆ సినిమాలో నటిస్తానని చెప్పడంతో.. హీరోయిన్ రష్మిక మందానని కాదని… సమంతాను ఫైనల్ చేసిందట చిత్ర బృందం. ఇలా అక్కినేని నాగచైతన్య భార్యగా నటించే ఛాన్స్ ను వదిలేసుకుంది హీరోయిన్ రష్మిక మందాన ( Rashmika Mandanna ). ఒకవేళ ఈ సినిమాలో రష్మిక నటిస్తే… ఆమె ఖాతాలో ఒక మంచి విజయం పడేది.