Rithu-Chowdary Comments Viral
Rithu Chowdary : సోషల్ మీడియా స్టార్, జబర్దస్త్ నటి రీతు చౌదరి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి.. జనాలకు దగ్గరైన ఈ బ్యూటీ… ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలలో కనిపించి మరింత దగ్గరయిపోయింది.
ఇప్పుడు జబర్దస్త్ లో ప్రతి షోలో నటిస్తూ.. ఒక గుర్తింపు తెచ్చుకుంది నటి రీతు చౌదరి. మొదట్లో మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సీరియల్ లో కూడా నటించింది. గోరింటాకు మరియు అమ్మ కోసం లాంటి సీరియల్స్ లో నటించి అటు సెంటిమెంట్ పీపుల్స్ కు కూడా దగ్గరయిపోయింది ఈ బ్యూటీ.
సీరియల్స్ చేసుకుంటూనే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టింది ఈ బ్యూటీ. ఆ వీడియోలు పాపులర్ అయ్యేందుకు తన అంద చందాలను కూడా ఆరబోసింది నటి రీతు చౌదరి. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ నటి రీతు చౌదరి. ఇది ఇలా ఉండగా తాజాగా నటి రీతు చౌదరి గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో నటి రీతు చౌదరిని ఉద్దేశించి… అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకో అంటూ కామెంట్ చేశాడు ఒక నేటిజన్. అతడు ప్రస్తుతం సమంతను వదిలేసాడు కదా… నువ్వు అతని పెళ్లి చేసుకో అని వెల్లడించాడు. అయితే దానిపై స్పందించిన నటి రీతు చౌదరి ( Rithu Chowdary )… అక్కినేని నాగచైతన్యను చేసుకునే అవకాశం వస్తే కచ్చితంగా చేసుకుంటాను… అంతకంటే అదృష్టం మరి ఏదీ లేదు అంటూ కామెంట్ చేసింది.