Trolling On Renu Desai
Renu Desai : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది రేణు దేశాయ్. రేణు దేశాయ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ అలనాటి హీరోయిన్గా అలాగే… పవన్ కళ్యాణ్ మాజీ సతీమణిగా రేణు దేశాయి అందరికీ తెలిసిన వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విడాకులు ఇచ్చిన రేణు దేశాయ్ ప్రస్తుతం… తన పిల్లలతో కలిసి ఉంటుంది.
తన కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా నటించిన రేణు దేశాయి.. పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత వీరిద్దరూ ఎన్నో ఏళ్లపాటు ప్రేమించుకొని… పెళ్లికి ముందు 10 సంవత్సరాలు సహజీవనం కూడా చేశారట. ఈ నేపథ్యంలోనే పెళ్లి కాకుండానే రేణు దేశాయ్ మరియు పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు అయ్యారు. పెళ్లి కాకుండానే అకిరా నందన్ రేణు దేశాయ్ కడుపున పుట్టాడు.
ఇక పెళ్లి తర్వాత మరో కూతురు పవన్ కళ్యాణ్ కు పుట్టింది. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ జంట విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ… ఏపీ ప్రజలు ఆయనకు అండగా ఉండాలంటూ స్పష్టం చేసింది రేణు దేశాయ్.
అయితే రేణు దేశాయ్ చేసిన ఆ పోస్టుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు దారుణంగా ట్రోలింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు ఓటేయాలంటూ రేణు దేశాయ్ చేసిన కామెంట్ కు ఓ నెటిజన్ స్పందిస్తూ…. అందుకే నిన్ను పవన్ కళ్యాణ్ తన్ని తరిమేసాడు అంటూ కామెంట్ చేశాడు. అయితే దానికి గాటుగా రేణు దేశాయ్ ( Renu Desai ) స్పందించింది. నన్ను తిట్టడంలో నీకు మనశ్శాంతి లభించిందా… పవన్ కళ్యాణ్ ను ఫాలో అయ్యేవారు, ఆయనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ నుంచి తిట్లు తినడం మాత్రమే నా జీవితానికి అర్థం… కానివ్వండి అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇచ్చింది.