CM Jagan : విద్యారంగంలో విప్లవాత్మక మార్పునకు సీఎం జగన్‌ శ్రీకారం

CM Jagan
CM Jagan

CM Jagan has initiated a revolutionary change in the education sector

CM Jagan : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మరో క్రేజీ న్యూస్‌ అందదించారు. విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పునకు సీఎం వైయస్‌.జగన్‌ శ్రీకారం చుట్టారు. ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. హార్వర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఉన్నతవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా కోర్సులు అందించేందుకు సిద్దం అయ్యారు.

ప్రఖ్యాత సంస్థ ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ…. ప్రఖ్యాత మాసివ్‌ ఓపెన్‌ ఆన్లైన్‌ కోర్సులు కంపెనీ (MOOC) ఎడెక్స్‌తో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగానే ఒప్పందంపై సంతకాలు చేశారు ఎడెక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనంత్‌ అగర్వాల్‌, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె శ్యామలరావు.

CM Jagan
CM Jagan

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( CM Jagan  ) మాట్లాడుతూ…ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని.. నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందం కారణంగా మరింత మేలు జరుగుతుందని చెప్పారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుందని.. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్‌, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్‌ సంయుక్త సర్టిఫికేషన్‌ విద్యార్థులకు లభిస్తుందని చెప్పుకొచ్చారు.

వారికి ఉచితంగా ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయని.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఈ సర్టిఫికెట్లు మరింతగా మెరుగుపరుస్తాయని తెలిపారు. మన దేశంలో లభ్యం కాని ఎన్నో కోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వివిధ కోర్సులకు అందుబాటులో లేని బోధనా సిబ్బంది కొరతను కూడా అధిగమించినట్టు అవుతుందన్నారు సీఎం జగన్‌.