Niharika : నిహారికతో సాయి ధరమ్ తేజ్ రిలేషన్‌..ఆ పని కూడా జరిగిందిగా !

Sai Dharam Tej Special Interst On Niharika

Niharika :  సుప్రీం హీరో సాయి ధరంతేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగేందుకు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చాలా కష్టపడుతున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో మంచి హిట్ అందుకొని ఈ టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో హీరోగా దర్శనమిచ్చాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్.

ఇక ఈమధ్య హీరో సాయిధరమ్ తేజ్ కు బైక్ యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా వినాయక చవితి రోజునే సాయి ధరంతేజ్ కు బైక్ యాక్సిడెంట్ చోటు చేసుకోవడం గమనార్హం. అయితే బైక్ ప్రమాదం తర్వాత బయటపడిన హీరో సాయి ధరమ్ తేజ్… తన రీయంట్రిలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే సంయుక్త మీనన్ మరియు సాయిధరమ్ తేజ జంటగా నటించిన విరూపాక్ష సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.

ఇక అటు తన మామ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేశాడు హీరో సాయిధరమ్ తేజ్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉండగా తాజాగా కొణిదెల నిహారికను ట్రోలింగ్ చేసిన ఓ వ్యక్తికి సాయి ధరంతేజ్ వార్నింగ్ ఇచ్చాడు. స్వాతి రెడ్డి తో కలిసి సాయి ధరంతేజ్ సత్యా అనే వీడియో సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పాట గురించి సాయి ధరంతేజ్ పోస్ట్ పెట్టగా… దానికి నిహారిక రిప్లై ఇచ్చింది. ఈ సాంగ్ చూడడానికి నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను అంటూ కామెంట్ చేసింది నిహారిక.

అయితే నిహారిక ( Niharika ) చేసిన కామెంట్ కు..ఓ నెటిజన్ కౌంటర్ ఇచ్చాడు. వాటి పైన ఉన్న ధ్యాస నీ కుటుంబం పైన పెడితే బాగుండేది అంటూ సెటైర్లు పిలిచాడు. అయితే ఆ కామెంట్ చూసిన సాయి ధరంతేజ్… కోపంతో రెచ్చిపోయాడు. వెంటనే ఆ కామెంట్ డిలీట్ చేయాలని ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే నిహారిక కు సపోర్ట్ గా సాయిధరమ్ తేజ్ నిలవడంతో… వారిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.