Venu Swami : ప్రమాదంలో మోక్షజ్ఞ కెరియర్…బాంబ్ పేల్చిన వేణు స్వామి..

Venu Swami on mokshagna career,

Venu Swami : మన ఇండియాలో జ్యోతిష్యం చాలా ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. చాలామంది జ్యోతిష్యం చూపించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే మన దేశంలో జ్యోతిష్యం పై చాలా నమ్మకం కూడా పెట్టుకున్న వారు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇక దానిని క్యాష్ చేసుకొని చాలామందిని జ్యోతిష్యులు.. బతుకుతున్నారు.

అచ్చం ఇలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చాలా ఫేమస్ అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జ్యోతిష్యాలను చెబుతూ…. ఫుల్ పాపులర్ అయిపోయారు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి.

ఆయన యూట్యూబ్ చానల్ల లో పాల్గొని… నిత్యం టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఉంటారు. అలా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీల జాతకాలు చెప్పి… అవి నిజం కావడంతో ఫుల్ పాపులర్ అయిపోయారు వేణు స్వామి గారు. అక్కినేని నాగచైతన్య మరియు సమంత, నయనతార జాతకం, రష్మిక మందాన్న ఇలా ఎంతోమంది తెలుగు తారల జాతకాలు చెప్పి.. సంచలనం సృష్టించారు ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి.

ఇది ఇలా ఉండగా తాజాగా నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోక్షజ్ఞ సినిమాలోకి వస్తే చాలా బాగానే ఉంటుంది.. కానీ మరో మూడేళ్ల వరకు అతను సినిమాలలోకి రాడు అంటూ బాంబు పేల్చాడు వేణు స్వామి ( Venu Swami ). దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.