Trisha : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. హీరోయిన్ త్రిష కృష్ణన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చెన్నైలో పుట్టి పెరిగిన హీరోయిన్ త్రిష… అటు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. 40 సంవత్సరాలు నిండినప్పటికీ తన బ్యాచులర్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. అలాగే తన అంద చందాలను కూడా… 20 ఏళ్ల యువతుల మైంటైన్ చేయడం కేవలం హీరోయిన్ త్రిషకి దక్కుతుంది.
అప్పట్లో టాలీవుడ్ చిత్రపరచడంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన హీరోయిన్ త్రిష… ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. వయసు పెరిగిన కొద్దీ ఏమాత్రం తరగని అందంతో యువతను మాత్రం తన వశం చేసుకుంటుంది త్రిష. ఇక ఇటీవల పోన్నియన్ సెల్వన్ పేరుతో వచ్చిన రెండు సినిమాలలో హీరోయిన్ త్రిష కీలక పాత్ర పోషించి అందరిని మెప్పించింది.

అయితే 40 సంవత్సరాలు దాటినప్పటికీ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోకపోవడంపై అనేక రూమర్స్ వచ్చాయి. పలువురు హీరోలతో హీరోయిన్ త్రిష అప్పట్లో ఎ*ఫైర్ నడిపినట్లు కొంతమంది జోరుగా ప్రచారం చేశారు. ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ త్రిష పెళ్లి పీటలు ఎక్కిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుందని కొందరు అంటున్నారు.
అయితే వాస్తవానికి అది త్రిష పెళ్లి కాదట. కేవలం ఓ ప్రమోషన్ వీడియో మాత్రమేనట. జిఆర్టి జ్యువెలర్స్ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా పెళ్లికూతురు గెటప్ లో త్రిష మెరిసింది. వెడ్డింగ్ థీమ్ లో ఈ యాడ్ ను షూట్ చేశారు. అయితే ఇందులో హీరోయిన్స్ త్రిష ( Trisha ) పెళ్లి గెటప్ లో కనిపించడంతో రహస్యంగా పెళ్లి చేసుకుందని అందరూ అనుకున్నారు. అయితే అసలు విషయం తెలియడంతో.. ఫ్యాన్స్ నిరాశాకు లోనయ్యారు.