AP Govt Good News to Employees
Cm Jagan : ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త అందించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఇవాళ జరిగిన ఏపీఎన్జీఓ మహాసభలలో పాల్గొన్నారు ఏపీ సీఎం జగన్. 12:05 కు బయలుదేరి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంకు చేరుకున్న సీఎం జగన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద మనసుతో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏను దసరా కానుకగా అందిస్తామని ఏపీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం జగన్.
హెల్త్ విభాగంలో మహిళా ఉద్యోగులకు 5 రోజుల క్యాజువల్ లీవ్ ఇవ్వబోతున్నట్లు కూడా ప్రకటించేశారు సీఎం జగన్. గ్రామ స్ధాయిలోనే సేవలు అందుబాటులోకి తెస్తూ.. 1.35 లక్షల శాశ్వత ఉద్యోగాలు ప్రారంభంలోనే ఇచ్చామని వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడంలో సమస్యలు వస్తాయని వారించినా వెనకడుగు వేయలేదు..నిజాయితీ, కమిట్మెంట్ తో అడుగులేసామన్నారు.

పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచామని.. గత ప్రభుత్వం లో ఎన్నికల ముందు వరకూ ఒక రూపాయి కూడా జీతం పెరగని వారికి, ఈ ప్రభుత్వం లో జీతాలు పెంచాని స్ఫష్టం చేశారు. ఓట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో గత ప్రభుత్వం జీతాలు పెంచిందని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా కోవిడ్ కాలంలో పేదలను బ్రతికించుకున్నామని చెప్పారు.
డిబిటి ద్వారా ప్రజలకు సరాసరి లంచాలకు, వివక్షకు తావివ్వకుండా సంక్షేమ ఫలాలు అందించామని.. ఎవరూ ఊహించని గడ్డుకాలం వచ్చినా ఈ ప్రభుత్వం వదిలేయలేదని వెల్లడించారు సీఎం జగన్. 54 ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది.. పర్మినెంట్ ఉద్యోగుల నియామకాన్ని చంద్రబాబు తగ్గించారని ఫైర్ అయ్యారు సీఎం జగన్ ( Cm Jagan ). పోలీసులు ఏం పాపం చేశారని టీడీపీవాళ్లు దాడి చేశారు.. పర్మిషన్ లేని రూట్‌లో వెళ్లొద్దన్నందుకు దాడులు చేస్తారా అని నిలదీశారు సీఎం జగన్.