Anasuya : రాజకీయాల్లోకి యాంకర్‌ అనసూయ..కేసీఆర్ బంపర్ ఆఫర్ !

Anasuya in to Politics

Anasuya : బుల్లితెర యాంకర్లలో అనసూయకు తనదైన గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. తన కెరీర్ ప్రారంభంలో ఒక నటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన యాంకర్ అనసూయ భరద్వాజ్… ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా సెటిల్ అయిపోయింది. అయితే జబర్దస్త్ యాంకర్ గా ఉన్న సమయంలోనే… యాంకర్ అనసూయకు వరుసగా ఛాన్స్ లు రావడమే కాకుండా… ఆమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.

ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాను రంగమ్మత్తగా చాలా పాపులారిటీ తెచ్చుకుంది ఈ యాంకర్ అనసూయ. అలాగే ప్రస్తుతం కుర్రకరు గుండెల్లో రైళ్లు పరిగెట్టెల తన అందాలను నిత్యం మారబోస్తూ చుక్కలు చూపిస్తోంది. ఇక గత ఏడాది కిందట పుష్ప సినిమాలో సునీల్ భార్యగా నటించి… తన క్రేజీ ఏంటో మరోసారి నిరూపించింది. ఇటు గాడ్ ఫాదర్ లో కూడా ఓకే లేక పాత్ర చేసి పరవాలేదనిపించింది.

ఇది ఇలా ఉండగా తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అనసూయ భరద్వాజ్ త్వరలోనే రాజకీయాలలోకి వస్తుందని సమాచారం అందుతుంది. అయితే ఈ విషయం అనసూయ చెప్పలేదు.. ఈ విషయం చెప్పింది ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.

2021 సంవత్సరం నుంచి అనసూయ భరద్వాజ్ జాతకం చాలా బ్రహ్మాండంగా ఉందని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అనసూయ భరద్వాజ్ ఏది పట్టిన బంగారం అవుతుందని వెల్లడించాడు. అలాగే ఆమె త్వరలోనే రాజకీయాలలోకి వస్తుందని.. నిజంగానే ఆమె వస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. కాగా అనసూయ భరద్వాజ్ ది తెలంగాణ రాష్ట్రం. దీంతో అనసూయ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరితే బాగుంటుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.