Rashmi Gautam about Her Lover Stories
Rashmi Gautam : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది యాంకర్లు ఉన్నప్పటికీ… యాంకర్ రష్మీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. యాంకర్ రష్మీ వచ్చిందంటే చాలు… టిఆర్పి రేటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనికి కారణం ఆమె కున్న క్రేజ్. పరిస్థితి బాగాలేదు కానీ.. అన్ని కలిసి వస్తే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయేది. రష్మీ చాలా అందంగా ఉంటుంది.
తన కెరీర్ ప్రారంభంలో సైడ్ హీరోయిన్ పాత్రలలో నటించి అందరినీ కనువిందు చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా దగ్గరయింది. అలాగే ఛాన్స్ వచ్చినప్పుడల్లా సినిమాలు కూడా చేస్తోంది యాంకర్ రష్మీ.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ రష్మీ బాయ్స్ హాస్టల్ తెలుగు రీమేక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో నటి రష్మీ విపరితంగా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది యాంకర్ రష్మీ. ప్రతి ఒక్కరి జీవితంలో రిలేషన్షిప్స్ మరియు హార్ట్ బ్రేక్స్ ఉంటాయని చెప్పుకొచ్చింది.
16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు చాలామంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారని వెల్లడించింది ఈ బ్యూటీ. అలాగే తన ప్రేమ బ్రేకప్ ల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. తన బ్రేకప్స్ గురించి చెప్పాలంటే అసలు లెక్క సరిపోదని… ఎంతోమంది ఉన్నారు అని మీనింగ్ వచ్చేలా రష్మీ ఎమోషనల్ అయింది. అయితే రష్మి గౌతమ్ ( Rashmi Gautam ) చేసిన వ్యాఖ్యలతో… ఆమెకు చాలా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.