Sree leela : సినిమాలకు హీరోయిన్ శ్రీ లీల గుడ్ బై ?

Sreeleela

Sreeleela Shocking Decision

Sree leela : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీ లీల… ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది. పెళ్లి సందడి సినిమా పెద్దగా హిట్ కాకపోయినా… ఈ బ్యూటీ కి అదృష్టం కలిసి వచ్చి… వరుసగా సినిమాల అవకాశాలు వస్తున్నాయి.

రవితేజ హీరోగా చేసిన ధమాకా సినిమాతో హీరోయిన్ శ్రీ లీల కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీల చేతిలో ఏకంగా 10 సినిమాల వరకు ఉన్నట్లు సమాచారం అందుతుంది. హీరో వైష్ణవ తేజ్, విజయ్ దేవరకొండ, ప్రిన్స్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరియు నవీన్ పోలిశెట్టి సరసన వరుసగా సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ.

Sreeleela

అలాగే తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది ఈ బ్యూటీ. ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు తీసుకుంటుందట హీరోయిన్ శ్రీ లీల. ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ శ్రీ లీల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చేందుకు సిద్ధమైందట ఈ బ్యూటీ. ప్రస్తుతం హీరోయిన్స్ రిలీల ఎంబిబిఎస్ లాస్ట్ ఇయర్ చదువుతోంది.

ఈ ఏడాది నవంబర్ మరియు డిసెంబర్ మాసంలో ఆమెకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయట. ఇలాంటి తరుణంలో ఆ రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట హీరోయిన్ శ్రీ లీల ( Sree leela  ). దీంతో టాలీవుడ్ నిర్మాతలు తల పట్టుకుంటున్నారట. రెండు మాసాలలో ఓ సినిమా తీసేయవచ్చు… ఇలా సెలవులు పెడితే అసలు కుదరదని మాట్లాడుకుంటున్నారట నిర్మాతలు.