Kriti Kharbanda says she found a hidden camera in her hotel room once
Kriti Kharbanda : స్టార్ హీరోయిన్ కృతి కర్బంధ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బోని అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించి అందరిని మెప్పించింది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన తీన్మార్ సినిమాలో కృతికర్బంధ నటించింది. అలాగే హీరో రామ్ చేసిన ఒంగోలు గిత్త సినిమాలో కూడా నటించింది.
తాజాగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ కృతికర్బందా సంచలన వ్యాఖ్యలు చేశారు. షూటింగ్స్ కోసం సిటీ అవతలకు వెళ్ళినప్పుడు… హీరోయిన్లకు ఎదురయ్య సమస్యల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ కృతి కర్బందా. తన రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఈ విషయంపై హీరోయిన్ కృతి కర్బంద మాట్లాడుతూ… కొన్ని సంవత్సరాల కిందట ఓ కన్నడ సినిమా కోసం బెంగళూరు నగరానికి వెళ్లానని తెలిపింది. అయితే అక్కడ ఉన్న ఓ హోటల్లో మేము స్టే చేసినట్లు వివరించింది ఈ బ్యూటీ. నేను ఎప్పుడూ ఏదైనా హోటల్ లేదా.. ఇతరుల రూమ్ లో ఉన్నప్పుడు కచ్చితంగా ఆ రూమ్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాను.
అదేవిధంగా బెంగళూరులో కూడా నాకు ఇచ్చిన రూమ్లో చాలా శ్రద్ధగా పరిశీలించాను. ఈ నేపథ్యంలోనే నాకు ఒక సీక్రెట్ కెమెరా దొరికిందని హీరోయిన్ కృతి కర్బంద వెల్లడించింది. సెటప్ బాక్స్ వెనకాల ఓ సీక్రెట్ కెమెరాను అమర్చారని… దాన్ని నేను గమనించి… వెంటనే ఆ విషయాన్ని బయట పెట్టానని తెలిపింది. అప్పుడే నాకు ఇలా కూడా చేస్తారని తెలిసిందని చెప్పుకొచ్చింది హీరోయిన్ కృతి కర్బందా ( Kriti Kharbanda ). ఇక అప్పటినుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను… ఎక్కడికి వెళ్లినా కెమెరాలు చూసి మరి ఆ రూమ్ తీసుకుంటున్న అని హీరోయిన్ కృతికర్బంద వెల్లడించింది.