Samantha : ప్రియుడితో సమంత రొమాన్స్….ఫోటో వైరల్ !

samantha
samantha

Samantha Boy Friend Photo Viral

Samantha : ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత… ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది హీరోయిన్ సమంత. ఇందులో భాగంగానే యశోద అనే సినిమాతో ఇటీవల కాలంలో హీరోయిన్ సమంత మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించి మరో హిట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటీ. సెప్టెంబర్ ఒకటో తేదీన ఖుషి సినిమా థియేటర్లలో ఏకంగా ఐదు భాషలలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఇందులో భాగంగానే మొన్న హైదరాబాద్ మహానగరంలో మ్యూజిక్ ఈవెంట్ను కూడా ఖుషి టీం నిర్వహించింది.

samantha
samantha

ఈ మ్యూజిక్ ఈవెంట్ లో హీరోయిన్ సమంత మరియు విజయ్ దేవరకొండ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి… స్టేజి పైన డ్యాన్స్ చేసి అందర్నీ అలరించారు. అయితే ప్రమోషన్స్ సమయంలో తన ఆరోగ్యం మెరుగు కోసం అమెరికాకు వెళ్ళింది సమంత. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హీరోయిన్ సమంత… తన ప్రియుడితో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుందని కొంతమంది అంటున్నారు.

ఈ కామెంట్స్ కు అసలు కారణం లేకపోలేదు. దీనికి కారణం సమంత ఇటీవల షేర్ చేసిన ఓ ఫోటో. ఓ వ్యక్తితో కలిసి జిమ్ లో సమంత వర్కౌట్ చేస్తుంది. అయితే ఆ సదరు వ్యక్తి ఫేస్ కనిపించకుండా ఫోటో క్యాప్షర్ చేసి మరి సోషల్ మీడియాలో పెట్టింది సమంత ( samantha ). దీంతో అతడు సమంత బాయ్ ఫ్రెండ్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే సమంతకు కాబోయే రెండో భర్త అంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.