Adah Sharma bought Sushant Singh Rajput’s flat
Adah Sharma : ముంబై ప్రాంతానికి చెందిన హీరోయిన్ ఆదాశర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలీవుడ్ హీరోయిన్ అయిన అయినప్పటికీ ఆదాశర్మకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. 2008 సంవత్సరంలో 1920 అనే సినిమాతో హిందీ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన ఆదాశర్మ… తొలి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ తొలి నటి గా అవార్డు దక్కించుకుంది.
ఆ తర్వాత తెలుగులో హార్ట్ ఎటాక్ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది ఈ బ్యూటీ ఆదా శర్మ. ఇటీవల కేరళ స్టోరీ సినిమాలో నటించి అందరినీ మెప్పించింది హీరోయిన్ ఆదాశర్మ. ఈ సినిమా వివాదాల్లోకి వెళ్లినప్పటికీ… కలెక్షన్స్ బాగా రాబట్టగలిగింది.

ఇది ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ నివాసం ఉన్న ఫ్లాట్ ను హీరోయిన్ ఆదాశర్మ కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు చాలా మంది స్టార్లు ముందుకు వచ్చారు. కానీ సైలెంట్ గా హీరోయిన్ ఆదాశర్మ ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
భారీ ధర పెట్టి సుశాంత్ సింగ్ ఫ్లాట్ కొన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇక మంచి ముహూర్తం చూసి ఆ ఫ్లాట్లోకి ఆదాశర్మ ( Adah Sharma ) షిఫ్ట్ కాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కాగా 15 కోట్ల బడ్జెట్తో చిన్న సినిమాగా తరగెక్కిన ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి మన అందరికీ తెలిసిందే.