Filmmaker AS Ravi Kumar Kisses Mannara Chopra In Press Meet
Mannara Chopra : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… కొంతమందికి మాత్రమే క్రేజ్ వస్తుందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలా హర్యానాకు చెందిన మన్నార చోప్రా కు కూడా మన తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. 2014 సంవత్సరంలో… తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది హీరోయిన్ మన్నారా చోప్రా.
2014 సంవత్సరంలో వచ్చిన ప్రేమ గీమ జాంతానై అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ మన్నారా చోప్రా. మన తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు హిందీ సినిమాలలో కూడా ఈ బ్యూటీ నటించి అందరిని మెప్పించింది. ప్రియాంక చోప్రా మరియు పరిణితి చోప్రాలకు హీరోయిన్ మన్నార చోప్రా దగ్గరి బంధువు. ఇది ఇలా ఉండగా హీరోయిన్ మన్నారా చోప్రాకు ఊహించని సంఘటన జరిగింది.

ఓ దర్శకుడు మన్నార చోప్రా కు పబ్లిక్ లోనే కిస్ ఇచ్చాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తిరగబడరా స్వామి అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ఈ నేపథ్యంలోనే… హీరోయిన్ మన్నారా చోప్రా భుజంపై చేయి వేసి దర్శకుడు రవికుమార్ చౌదరి రచ్చ చేశాడు. హీరోయిన్ మన్నారా చోప్రా భుజంపై చేయి వేసి గట్టిగా కిస్ ఇచ్చాడు దర్శకుడు రవికుమార్ చౌదరి. అందరూ ఉండగానే మీడియా ముందు… హీరోయిన్ మన్నారా చోప్రా ( Mannara Chopra ) కు కిస్ ఇవ్వడం పై… దర్శకుడు రవికుమార్ చౌదరి పై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d
— Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023