amala paul Comments on her career
Amala Paul : మన ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న హీరోయిన్ అమలాపాల్ గురించి… ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భాష మరియు ప్రాంతం మని తేడా లేకుండా… అన్ని భాషలలో హీరోయిన్ అమలాపాల్ రాణిస్తూ ఉంది. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్…. అటు తమిళ హీరోలు అయిన విజయ్ మరియు ధనుష్ సరసన నటించి ఈ స్టార్ హీరోయిన్గా మారిపోయింది అమలాపాల్.
ముఖ్యంగా హీరో ధనుష్ చేసిన రఘువరన్ బీటెక్ సినిమాతో హీరోయిన్ అమలాపాల్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అయితే హీరోయిన్ అమలాపాల్ జీవితంలో కొన్ని జరిగిన సంఘటనల వల్ల ఆమె కెరీర్ కాస్త నాశనమైంది. స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన ఈ బ్యూటీ ఆ తర్వాత… తన క్రేజ్ ను దక్కించుకోలేకపోయింది.

కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో ప్రేమ మరియు పెళ్లి అంటూ సినిమాలకు దూరమై… తన కెరీర్ ను చేజేతుల చేజార్చుకుంది హీరోయిన్ అమలాపాల్. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అమలాపాల్. విడాకులు తీసుకున్నప్పటికీ… తన క్రేజీ తగ్గలేదని నిరూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ ఇండస్ట్రీలో ఆమెను తొక్కేసే ప్రయత్నం మాత్రం ఆగలేదు.
ఇది ఇలా ఉండగా తాజాగా… తన కెరీర్ గురించి హీరోయిన్ అమలాపాల్ ఆసక్తికర విషయాలు పేర్కొంది. తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాను అని పేర్కొన్న అమలాపాల్… తనను చాలా మంది మోసం చేశారని కూడా తెలిపింది. 13 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతూ పైకి వచ్చానని పేర్కొన్న అమలాపాల్ ( amala paul )…. సినిమాలు ఫ్లాప్ కావడంతో నా కెరీర్ పీక్ స్టేజ్ లోకి వెళ్లిందని తెలిపింది. కానీ కష్టపడి పైకి వచ్చానని వివరించింది హీరోయిన్ అమలాపాల్.