Nagma comments on her marriage
Nagma : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… కొంతమంది హీరోయిన్లకు ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పవచ్చు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపి ఇప్పుడు… కొంతమంది చాలా సైలెంట్ అయిపోయారు. అలా అప్పట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నటి నగ్మా ఒకరు.
హీరోయిన్ నగ్మా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులను తన అంద చందాలతో ఉర్రూతలూగించింది ఈ బ్యూటీ నగ్మా. సౌత్ ఇండియా పరిశ్రమలోనే హీరోయిన్ నగ్మా… అగ్ర నటిగా కొన్ని సంవత్సరాలు కొనసాగిందని చెప్పవచ్చు. అయితే ఆమె టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దూరమై దాదాపు 25 సంవత్సరాలు పూర్తి అయింది.

టాలీవుడ్కు దూరమైన తర్వాత ఇతర భాషలలో కొన్ని సినిమాలు చేసి.. 2008 సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం నగ్మా వయసు 48 అంటే దాదాపు 50 సంవత్సరాలు అన్నమాట. అయితే ఒకానొక సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తో… నటి నగ్మా ప్రేమాయణం నడిపిన సంగతి మనందరికీ గుర్తుండే ఉంటుంది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అప్పట్లో అనుకున్నారట. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ కావడంతో అసలు పెళ్లి చేసుకోవద్దని నగ్మా ( Nagma ) నిర్ణయం తీసుకుందట.
48 సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నగ్మా ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఇది ఇలా ఉండగా తాజాగా తన పెళ్లి పై నగ్మా స్పందించి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని ఆలోచన తనకు లేదని.. కానీ ఒక తోడు ఉండాలని కోరుకుంటున్నాను తెలిపింది. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకుంటానని… అంతేకాదు పిల్లలను కూడా కంటానని చెప్పుకొచ్చింది నగ్మా.