Rashmika Mandanna Doing Crazy Role
Rashmika Mandanna : తెలుగు స్టార్ హీరోయిన్.. కన్నడ బ్యూటీ రష్మిక మందాన గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ బ్యూటీగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందాన… ఇండియన్ క్రష్ గా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. హీరోయిన్ రష్మిక నటించిన పుష్ప సినిమాకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించడంతో… ఈ బ్యూటీ కి బాలీవుడ్ లో కూడా ఛాన్స్ వచ్చింది.
దీంతో ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది తెలుగు స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ రష్మిక మందాన. కన్నడ చిత్ర పరిశ్రమలో కిరిక్ పార్టీ… సినిమా మంచి విజయం అందుకోవడంతో రష్మిక మందాన అదృష్టం మారిపోయింది. కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగులోనే మంచి ఫలితాలు అందుకుంది రష్మిక మందాన.

కన్నడలో సినిమాలు మంచి సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నాగశౌర్య హీరోగా చేసిన చలో సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఇది ఇలా ఉండగా తాజాగా రష్మిక మందాన గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం రష్మిక మందాన ( Rashmika Mandanna ) చేతిలో తెలుగు సినిమాలు లేవు. దీంతో బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకోలేకపోయింది రష్మిక మందాన. దీంతో బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చే సేందుకు కూడా నిర్ణయం తీసుకుందట. ఆ సాంగ్ లో చాలా హాట్ గా కనిపించాలని దర్శకుడు కండిషన్ కూడా పెట్టాడట. దానికి కూడా రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.