CM JAGAN : ఏపీలో ఈ రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కో అకౌంట్‌లో రూ.7,500 జమ

CM YS Jagan
CM YS Jagan

YSR Rythu Bharosa Tenant Farmers Today 

CM JAGAN : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కౌలు రైతులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వరుసగా ఐదో ఏడాది.. మొదటి విడతగా..కౌలు రైతులకు “వైఎస్సార్ రైతు భరోసా” అందించింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు (సీపీఆర్ సీలు) పొందినవారిలో అర్హులైన 1,46,324 మందిఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు “వైఎస్సార్ రైతు భరోసా” అందించారు సీఎం జగన్‌.

అలాగే… దేవాదాయ భూముల సాగుదారులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా సాయంగా రూ. 109.74 కోట్లు విడుదల చేశారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ. 11.01 కోట్లతో కలిపి మొత్తం రూ. 120.75 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్.

CM YS Jagan
CM YS Jagan

సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొప్పి.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని కౌలు రైతులకు డబ్బులు వేశారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. రైతులు, కౌలుదారులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం జగన్. రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామని వెల్లడించారు.

రైతు నవ్వుతూ ఉంటేనే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం బాగుంటుందని స్పష్టం చేశారు సీఎం జగన్ ( CM JAGAN  ). ఇక అటు ఏపీలో ఉన్నత విద్యా శాఖలో పోస్టుల భర్తీ కసరత్తు చేస్తోంది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,295 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించేసింది. అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఉన్నత విద్యా మండలి… త్వరలోనే భర్తీ కూడా చేయనుంది.