CM JAGAN on ysr
CM JAGAN : ఇవాళ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వై.యస్.రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ నేపథ్యంలోనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదంటూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వై.యస్.రాజశేఖరరెడ్డిను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు ఏపీ సీఎం జగన్.
భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు అంటూ కొనియాడారు సీఎం జగన్. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయని… మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయని వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా అంటూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డిను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక అటు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సరిగ్గా ఇదే రోజు వైఎస్ఆర్ ప్రయాణించిన విమానం కనిపించలేదు అన్నా ఒక ధీమా ఉండేదని తెలిపారు.
ఆయన ఎక్కడికి వెళతారు… కచ్చితంగా వస్తారు అనుకున్నామని.. ఒక వ్యక్తి పాలన పై, ప్రజల జీవితాల పై ఎంత ప్రభావం వేయగలరు అనటానికి వైఎస్సార్ ఒక ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు. కోట్లాది ప్రజల గుండెల్లో రాజశేఖరరెడ్డి చిరస్థానం సంపాదించారని.. సిద్ధాంతాలు పెట్టుకుని పాలించలేదని వివరించారు. అందరూ తన కుటుంబ సభ్యులే అనుకున్నారని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో తలమానికంగా నిలబెట్టారని కొనియాడారు. వైఎస్ఆర్ కు తగ్గ వారసుడు సీఎం జగన్ ( cm jagan ) అని..పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ఒక వెలుగు తెచ్చారని… వైఎస్సార్ తర్వాత అలుముకున్న చీకటిలో వెలుగు రేఖ తెచ్చిన వ్యక్తి జగన్ అని చెప్పుకొచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.