Reason For Actress Kalyani’s Divorce With Suriya Kiran
Kalyani : టాలీవుడ్ సీనియర్ నటి కళ్యాణి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు వెలిగిన హీరోయిన్లలో కళ్యాణి ఒకరు. కేరళకు చెందిన హీరోయిన్ కళ్యాణి… శేషు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత రవితేజ హీరోగా చేసిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది హీరోయిన్ కళ్యాణి.
ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వెనక్కి చూసుకోకుండా దూసుకు వెళ్లింది బ్యూటీ కళ్యాణి. వసంతం, ఆపరేషన్ దుర్యోధన మరియు పెళ్ళాంతో పనేంటి లాంటి ఎన్నో సినిమాలు చేసి ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకుంది కళ్యాణి. ఇక ప్రస్తుతం నటనకు దూరమైన హీరోయిన్ కళ్యాణి గురించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

హీరోయిన్ కళ్యాణి… సినీ దర్శకుడు సూర్యకిరణ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సూర్యకిరణ్ మరియు నటి కళ్యాణి ఇద్దరు కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్నారు. అయితే సూర్య కిరణ్ మరియు నటి కళ్యాణి విడాకులు తీసుకోవడం వెనుక నటుడు జగపతిబాబు ఉన్నారని తెలుస్తోంది.
జగపతిబాబు మరియు నటి కళ్యాణి మధ్య రిలేషన్షిప్ అప్పట్లో ఉండేదట. జగపతిబాబు మరియు నటి కళ్యాణి ఇద్దరు కలిసి పందెం, కబడ్డీ కబడ్డీ, రక్షా, పెద్దబాబు, ఓ మనిషి కథ లాంటి ఎన్నో సినిమాలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కబడ్డీ కబడ్డీ సినిమా సమయం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అయితే ఈ విషయాన్ని తరచూ సూర్య కిరణ్… గుర్తు చేస్తూ కళ్యాణి ( Kalyani ) ని వేధించే వాడట. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారని ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.