anil kumar yadav on chandrababu notices
CM JAGAN : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఐటీ నాలుగో నోటీసు ఇచ్చిందని.. ఒక ఏడాది అసెస్‌మెంట్ కు సంబంధించి 118 కోట్లు ముడుపులకు సంబంధించిన వ్యవహారం ఇదంటూ ఫైర్ అయ్యారు అనిల్ కుమార్. మనోజ్ వాసుదేవ్ ను తనిఖీలు చేస్తుంటే తీగ లాగితే డొంక కదిలినట్లు చంద్రబాబు వ్యవహారాలు బయటకు వచ్చాయని తెలిపారు.
షాపూర్ జీ పల్లోంజి లో మనోజ్ వాసుదేవ్ కీలక వ్యక్తి అంటూ పేర్కొన్నారు. 2020లోనే రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి సమకూర్చుకున్నాడని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఆరోపణలు ఉన్నాయని.. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్ని వ్యవహారాలు బయటకు తీస్తే వేల కోట్ల రూపాయల దోపిడీ విషయాలు బయటకు వస్తాయన్నారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.

చంద్రబాబు కప్పను మింగిన పాములాగా వ్యవహరిస్తున్నాడని… వెల్లడించారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్. చంద్రబాబు మీడియా ప్యాంట్లు తడుస్తున్నాయా? ఎందుకు ఈ వార్తల రాయటం లేదు?? అని ఆగ్రహించారు. దత్తపుత్రుడు కనీసం ట్వీట్ ద్వారా అయినా ఎందుకు స్పందించ లేకపోతే ఉన్నాడు?? పురంధరేశ్వరి ఎందుకు నోరు అని రెచ్చిపోయారు. బంధు ప్రీతినా?? మరిది ప్రీతినా?? అంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.
ఊర్లు పట్టుకుని తిరుగుతున్న పులకేశి కూడా స్పందించటం లేదని…తండ్రి, కొడుకులు ఇద్దరి పేర్లు ఈ 45 పేజీల నోటీసులో ఉన్నాయని విమర్శలు చేశారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్. వచ్చేది సీఎం జగన్ ( CM JAGAN ) సర్కార్ అన్నారు. చంద్రబాబు ఢిల్లీకి పరుగులు పెడుతుండటం వెనుక ఈ కేసుల మతలబు ఉందని స్పష్టం అయ్యింది…ఈ ముడుపుల్లో పవన్ కళ్యాణ్ కు కూడా వాటా ఉందా?? అని ప్రశ్నించారు. వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణా ఎందుకు మాట్లాడటం లేదో అర్థం కావటం లేదని..చంద్రబాబు పాపం పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్.