Mahesh Vitta : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలు ఎంతో మంది కామెడీయన్లు ఉన్న సంగతి తెలిసిందే. వారిలో కొంతమందికి మాత్రమే ఫేత్ వచ్చింది. అయితే మహేష్ విట్టా అనే కమెడియన్… యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు పెట్టి ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చి… బాగా పాపులర్ అయిపోయాడు మహేష్ విట్టా.
బిగ్బాస్ మూడవ సీజన్ లో అవకాశం దక్కించుకున్న మహేష్ విట్టా… ఆ తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కమెడియన్గా ఎదిగిపోయాడు. ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన మహేష్ విట్టా… వయసు 28 సంవత్సరాలు మాత్రమే. మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ చేసి… ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

అయితే తాజాగా ఈ టాలీవుడ్ కమెడియన్ మహేష్ విట్టా ఓ ఇంటివాడు అయ్యాడు. తాజాగా మహేష్ విట్టా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరికి తెలియకుండా సైలెంట్ గా తాను ప్రేమించిన శ్రావణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కమెడియన్ మ హేష్ విట్టా. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు కమిడియన్ మహేష్.
ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మహేష్ విట్టా ప్రకటించడంతో.. అతని అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటన్నా ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నావ్… ఓకే లే అంటూ మహేష్ విట్టా ( Mahesh Vitta ) కు కంగ్రాట్స్ చెబుతున్నారు. వదినమ్మతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్.