Rajamouli is going to be a father again
Rajamouli : టాలీవుడ్ దర్శకులలో టాప్ మోస్ట్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు అపజయం లేని ఏకైక దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. తన కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ డైరెక్ట్ చేసుకుంటూ బతికేసిన రాజమౌళి… స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు.
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు అన్ని సినిమాలు గ్రాండ్ విక్టరీ కొట్టినవే. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాలు తీసే రాజమౌళి…ఆర్ఆర్ఆర్ సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇటీవల ఆస్కార్ అవార్డు రావడంతో… రాజమౌళి స్థాయి ప్రపంచ స్థాయికి చేరింది.

ఇక ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభ దశలోనే ఉంది. ఇది ఇలా ఉండగా ఎస్ఎస్ రాజమౌళి గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది.
రమాదేవిని మొదట రాజమౌళి పెళ్లి చేసుకున్నాడు. రమాకు రెండవ వివాహం కాగా… రాజమౌళికి ఇది మొదటి వివాహం. అయితే రమాదేవి మరియు రాజమౌళి ( Rajamouli ) కి ఇప్పటివరకు సంతానం లేదు. ఈ నేపథ్యంలోనే గతంలో ఓ ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. ఇక లేటెస్ట్ గా మరోసారి మరో అమ్మాయిని దత్తత తీసుకునేందుకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నారట. దీంతో రాజమౌళి తండ్రి కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.