Actress koushalya about her marriage
Actress koushalya : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యూటీలకే దర్శకులు అలాగే నిర్మాతలు ప్రిఫరెన్స్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. అలా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చాలామంది హీరోయిన్లు.. ఇప్పటికీ ఇండస్ట్రీని ఏలుతున్నారు.
అలా అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది నటి కౌసల్య. మొదట మోడల్ గా పనిచేసిన నటి కౌసల్య ఆ తర్వాత 1996 సంవత్సరంలో మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగు పెట్టింది. ఆ తర్వాత మలయాళంలో వరుసగా ఈ బ్యూటీకి ఆఫర్లు వచ్చాయి.

ఇక తెలుగులో 1999 సంవత్సరంలో అల్లుడుగారు వచ్చారు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పంచదార చిలక, గౌరీ, మహానది, వియ్యాలవారి కయ్యాలు లాంటి ఎన్నో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు తెలుగులో హీరోల తల్లి లేదా హీరోయిన్ల తల్లి పాత్రలో కనిపించి మెప్పిస్తుంది. అయితే 43 సంవత్సరాలు ఉన్న నటి కౌసల్య ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తనకు పెళ్లి అంటే ఇష్టమేనని… కానీ అప్పట్లో నాకు అనారోగ్యం రావడం వల్ల పెళ్లి చేసుకోలేదని వెల్లడించింది. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నానని పేర్కొంది. లివింగ్ రిలేషన్షిప్ పైన కూడా అప్పట్లో ఇంట్రెస్ట్ ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే కౌసల్య ( Actress koushalya ) సన్నిహితుల సమాచారం మేరకు ప్రస్తుతం కూడా ఓ వ్యక్తితో ఈ బ్యూటీ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తుందట. పెళ్లి చేసుకోకుండానే జీవితాంతం అతనితో ఉండాలని… కౌసల్య అనుకుంటోందట.