Ramya Krishna Dating Before Marriage
Ramya Krishna : టాలీవుడ్ అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాకుండా తమిళ ఇండస్ట్రీని కూడా ఒక ఊపు ఊపేసింది రమ్యకృష్ణ. చెన్నైలో పుట్టి పెరిగిన రమ్యకృష్ణ… దర్శకుడు కృష్ణవంశీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి రిత్విక్ అనే అబ్బాయి ఉన్నాడు. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు అంటే దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ చిత్ర పరిశ్రమలలో… రమ్యకృష్ణ దుమ్ము లేపేసిందని చెప్పుకోవచ్చు.
1987 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమలో బాలమిత్రులు సినిమాతో అడుగుపెట్టింది రమ్యకృష్ణ. ముఖ్యంగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. అలాగే రజనీకాంత్ హీరోగా చేసిన నరసింహ చిత్రంలో నటించి ఆ పాత్రకే వన్నెతెచ్చింది నటి రమ్యకృష్ణ.

హీరోయిన్ గా కాకుండానే… లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ. అలాగే లేడీ విలన్ గా కూడా చాలా సినిమాలలో కనిపించి అందరిని మెప్పించింది నటి రమ్యకృష్ణ. ఇది ఇలా ఉండగా తాజాగా రమ్యకృష్ణ రిలేషన్షిప్ గురించి బయటపడింది. పెళ్లి కాకముందే ఓ వ్యక్తితో రిలేషన్షిప్ మైంటైన్ చేసిందట రమ్యకృష్ణ.
ఆ వ్యక్తి ఎవరో కాదు రమ్యకృష్ణ హస్బెండ్ కృష్ణవంశీ. కృష్ణవంశీ మరియు రమ్యకృష్ణ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సినిమాలు చేస్తున్న సమయంలోనే.. కృష్ణవంశీతో డేటింగ్ చేసిన రమ్యకృష్ణ ( Ramya Krishna )… ఆ తర్వాత అతని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చ నియాంశంగా మారిపోయింది.