Beautiful Sita in Chiru movie
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కు బాగా తెలుసు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇండస్ట్రీలోకి రావడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో సినిమాలు బాగా చేసి రాజకీయాల్లోకి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. పాలిటిక్స్ కు గుడ్ బాయ్ చెప్పి మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలు విడుదల చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది జనవరిలో వాల్తేరు వీరయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి… బంపర్ విజయాన్ని అనుకున్నాడు. అయితే అదే ఊపుతో బోలాశంకర్ సినిమా కూడా విడుదల చేయించాడు చిరంజీవి. కానీ చిరంజీవి ప్రయత్నం బెడిసి కొట్టింది. చిరంజీవి నటించిన భోళా శంకర అట్టర్ ఫ్లాప్ అయింది.

ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి…. మరో సినిమా కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా మూవీ క్రియేషన్స్ వారు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చేస్తున్న నటించేందుకు బాలీవుడ్ బ్యూటీని బరిలోకి దించుతున్నారు.
ఈ సినిమా స్టోరీ ప్రకారం బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ అయితే బాగుంటుందని…. చిరంజీవి ( Chiranjeevi ) సరసన హీరోయిన్గా కూడా సెట్ అవుతుందని చిత్ర బృందం డిసైడ్ అయిందట. ఈ మేరకు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.