
మహేష్ బాబు గురించి కానీ ఆయన ఫ్యామిలీ గురించి కానీ పరిచయం చేయక్కర్లేదు. మహేష్ ఫ్యామిలీ అంతా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా వుంటారు. నమ్రత, సితార ఇద్దరును బాగా యాక్టివ్ గా ఉంటుంటారు. మహేష్ బాబు కూడా తాజా ఫొటోస్ ని సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటూ వుంటారు. మొన్న అయితే గౌతమ్ చేసిన మంచి పనులు, హాస్పిటల్‌కు వెళ్లి పిల్లల వార్డులో గడపడం కి సంబందించిన ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే గత రెండు వారాల క్రితం మహేష్ బాబు పెంపుడు కుక్క ప్లూటో చనిపోయింది. ప్లూటో గత ఏడేళ్లుగా మహేష్ ఇంట్లో ఉంటోంది. ఈ విషయం పై నమ్రత ఓ పోస్ట్ ని షేర్ చేసుకున్నారు. ఏడేళ్ల బంధాన్ని మిస్ అవుతున్నాను అంటూ సితార ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలానే గతం లో కూడా సితార ప్లూటో గురించి చెబుతూ పోస్టులు చేసింది. అవన్నీ కూడా ఒక్క సారిగా వైరల్ అయ్యాయి.
ప్లూటో మరణంతో నమ్రత కూడా బాగా కుమిలిపోయింది. మహేష్ బాబు కూడా చాలా బాధ పడినట్టు తెలుస్తోంది. పెట్ చనిపోయిందని, బాధ పడిన మహేష్ బాబు షూటింగ్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారట. ఇంత జరిగిందట ఆ పెట్‌తో ఎంతలా కనెక్ట్ అయిపోయారో. ఇప్పుడు వాళ్ళు ఇంకో కొత్త పెట్ ని తెచ్చుకున్నారట.
ఆ పెట్ పేరు స్నూపీ అని పెట్టారు. ఆ పెట్ వచ్చాక ఓ పోస్ట్ ని కూడా పెట్టారు. ఇక ప్లూటో బాగా గుర్తుకు వస్తుండటంతో ఇప్పుడు మేము ఇలా దాని లానే ఉన్న మరో పెట్‌ను తీసుకు వచ్చాము అని చెప్పారు. దీని పేరు స్నూపీ అని కూడా చెప్పారు.