రకుల్ ప్రీత్ సింగ్ (Rakul) గురించి పరిచయం చేయక్కర్లేదు. తెలుగు లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా సినిమాలు చేసింది. హిందీలో ఒకటి రెండు సినిమాలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్. హిందీలో తాజాగా ఓ సినిమా లో కనబడింది ఆ సినిమాలో బోల్డ్ గా కనపడి అందరిని ఆకట్టుకుంది. ఓటిటి లో ఈ సినిమా రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాలో రకుల్ కండోమ్స్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో కనబడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక కొత్త లగ్జరీ కార్ ని కొన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ కారుకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బెంజ్ కంపెనీకి చెందిన ఈ కారు విలువ ఎంతో తెలుసా.. ఈ కారు (Rakul car price) విలువ మూడు కోట్లు ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇక రకుల్ విషయానికి వస్తే తెలుగు లో ఈమె కి అవకాశాలు బాగా తగ్గాయి ప్రస్తుతం ఈమె ముంబై లో ఉంటోంది.
రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది గతంలో కూడా రకుల్ పెళ్లి గురించి అనేక రూమర్లు వచ్చాయి త్వరలోనే ఈమె హిందీ యువ నిర్మాత నటుడు ని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుండి అతనితో ఈమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకు వెళ్లాలని వీళ్ళిద్దరూ చూస్తున్నారట త్వరలోనే పెళ్లి గురించి ఏదో ఒక ప్రకటన చేస్తుందని సమాచారం. ఇటీవల మరో ప్రేమ జంట కియరా సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి అయిన విషయం తెలిసిందే.
చత్రివాలి సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీడీలో స్ట్రీమింగ్ కి వచ్చింది చాలామంది ఇప్పటికే ఈ సినిమాని చూశారు అయితే అనుకున్న రేంజ్ లో మాత్రం ఈ సినిమా ఆకట్టుకోలేదు. మరోవైపు రకుల్ పరిస్థితి ఏం బాలేదు అని తెలుస్తోంది అవకాశాలు రావట్లేదట. ఒకప్పుడు హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ కోటి 50 లక్షలు వరకు తీసుకునేదట కానీ ఇప్పుడు పారితోషకం కూడా బాగా తగ్గిందని తెలుస్తోంది తెలుగు తో పాటుగా హిందీలో కూడా ఈమె చాటుకుంది కానీ పరిస్థితి మాత్రం ఇప్పుడు బాగోకపోవడం ఘోరమే. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రన్వే 34 కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.