Tollywood star couple to announce divorce soon
Tollywood Divorce : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమమే కాకుండా…. బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇలా పెళ్లి చేసుకోవడం… చిన్న చిన్న గొడవలతో విడిపోవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే మన ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. ఇంకా ఈ విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఈమధ్య కాలంలోనే కాకుండా… అప్పట్లో అక్కినేని నాగార్జున నుంచి… ఇప్పటి కొణిదల నిహారిక వరకు… చాలామంది సినీ సెలబ్రిటీలు విడాకులు తీసుకొని రెండో పెళ్లిళ్లు చేసుకుని జీవిస్తున్నారు. అక్కినేని నాగచైతన్య మరియు సమంత… అసలు కారణాలు చెప్పకుండానే విడిపోగా… నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య కూడా ఇటీవల కారణాలు చెప్పకుండానే విడిపోయారు. అయితే నిహారిక ఎపిసోడ్ మర్చిపోకముందే… టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సెలబ్రిటీ జంట విడాకులు తీసుకునేందుకు సన్నద్ధమైంది.

ఇందులో ట్విస్ట్ ఏంటంటే… పెళ్లి అయినా ఆరు నెలలు కాకుండానే… ఈ జంట విడిపోనుందట. అతను ఎవరో కాదు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ డైరెక్టర్ అని సమాచారం అందుతోంది. ఆదర్శకుడు మొదట్లో ఇండస్ట్రీలో నటుడుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడుగా మారాడు. ఈ మధ్యకాలంలో ఓ స్టార్ హీరోతో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ఈ దర్శకుడు.
ఇటీవల కాలంలోనే ఆ దర్శకుడు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ ఆదర్శకుడు మరియు అతని భార్య మధ్య గొడవలు తరచూ వస్తున్నాయట. ఇలా పెళ్లి జరిగినప్పటి నుంచి ఐదు నెలలుగా ఇది తంతు జరుగుతోందట. దీంతో పెళ్లి అయి ఆరు నెలలు గడవకముందే విడాకులకు కూడా అప్లై చేశాడట ఆ దర్శకుడు. దీంతో ఆ స్టార్ దర్శకుడు ఎవరు అనేదానిపై అందరూ చర్చిస్తున్నారు. మొత్తానికి మరో టాలీవుడ్ డైవర్స్ ( Tollywood Divorce ) కేసు నమోదు అయిందని కూడా అనుకుంటున్నారు.