మిస్ శెట్టి పై ప్రశంసలు కురిపిస్తున్న సామ్..!!

Samantha

Samanthasamantha: చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. కానీ అందరూ అనుకున్నంత రేంజ్ లోకి వెళ్లలేరు. కొన్ని సినిమాలు చేసిన తర్వాత మళ్లీ అవకాశాలు కొంతమందికి లభించవు. దాంతో ఇండస్ట్రీకి దూరమవుతారు. కొంతమంది హీరోయిన్లు అయితే ఇండస్ట్రీలోకి వస్తారు కొన్ని సినిమాలు చేస్తారు. తర్వాత ఏవో కారణాలు వలన గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాలు లోకి రీఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ అనుష్క గురించి చెప్పక్కర్లేదు అనుష్క అందరికి సుపరిచితమే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది అనుష్క.

ఈ సినిమాకి మహేష్ బాబు పి దర్శకత్వం వహించారు ఇప్పటివరకు మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది మంచి కలెక్షన్లు కూడా సినిమా రాబట్టింది. అనుష్క ఈ సినిమాలో తన నటనతో బాగా ఆకట్టుకుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ కూడా సినిమాకి ప్లస్ అయింది. ఈ సినిమాను చూసి ఇప్పటికే చిరంజీవి రాజమౌళి మారుతి ఇలా చాలా మంది ప్రముఖులు ప్రశంసించారు.

తాజాగా ఈ సినిమా పై స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించారు. పోలిశెట్టి (miss shetty mr polishetty) సినిమాని చూశాను. అనుష్క తో ఉన్న స్నేహం తోనే ఈ సినిమా చూశానని ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా నన్ను ఇంతలా నవ్వించలేదంటూ అనుష్కని మెచ్చుకుంది అనుష్క చాలా చార్మింగ్ గా కనిపించారని సమంత చెప్పుకొచ్చింది.

నవీన్ బ్రిలియంట్ పర్ఫామెన్స్ ని ఇచ్చారంటూ సమంత పోస్ట్ చేసింది. సినిమా చాలా నచ్చిందంటూ ఆమె అంది. యూఎస్ లో ఆఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ ని ఈ సినిమా టచ్ చేసినట్లు తెలుస్తోంది. అనుష్క దాదాపు ఐదేళ్ల తర్వాత సినిమాలో నటించారు. సినిమా చూశాక అనుష్కకి అదిరిపోయే కం బ్యాక్ వచ్చిందంటూ ఫ్యాన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.