Shakeela in biggboss: బిగ్ బాస్ హ్యూస్ లో ఇప్పటికే సందడి వచ్చేసింది. హౌస్ లో రచ్చ మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. అయితే ఈ వారము 14 మందిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం జరిగింది. కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి ఈ వారం ఏలిమినేట్ అయి పోయింది.
ఈమె బయట కి వచ్చాక కొంతమంది పై పాజిటివ్ కామెంట్స్ చేసింది. అదే కాక కొందరు పై నెగిటివ్ కామెంట్స్ చేసింది. ఈమె ఓవర్ కాన్ఫిడెన్స్ తో పల్లవి ప్రశాంత్ , రతిక వున్నారని సంచలన కామెంట్స్ చేసింది. షకీలా, శివాజీ ను మాత్రం ఈమె మెచ్చుకుంది.
కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యి వెళ్తుంటే.. షకీలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వారం ఈ విధంగా సాగింది. ఇక ఆదివారం హౌస్ లోకి వచ్చారు నాగ్. ఏది గుర్తుంచుకోవాలని వుంది, ఏది మరిచిపోలవనుకుంటున్నారు అన్నది నాగ్ అడిగారు. ఒక్కొక్కరు వాళ్ళ కి నచ్చిన విషయాలని షేర్ చేసుకున్నారు.
అయితే దీని మీద తేజ మాట్లాడుతూ శివాజీ చెప్పడంతో షకీలా హౌస్ లో ఉన్న వారిని భయ పెట్టారు. దేయ్యం పెట్టినట్టుగా నటించి భయపెట్టింది. నేను కూడా ఆమె ని చూసి చాలా భయపడ్డాను. దాన్ని నేను మరిచిపోవాలని అనుకుంటున్నా అన్నాడు తేజ. షకీలా హౌస్ లో చాలా ఎలుకలు ఉన్నాయి. ఒప్పుకుంటే
ఎలుకల మందు పెట్టి అన్నింటిని చంపేస్తాను. తేజకు కూడా ఎలుకల మందు కలిపి పెట్టేస్తా అని ఆమె తమాషా చేసింది.