Tollywood heroines in Pan India movies
ఈరోజుల్లో చాలా మంది నటులు (Star heroines) ప్యాన్ ఇండియా లో కలిసిపోతున్నారు. వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ దూసుకు వెళ్ళిపోతున్నారు. చాలామంది నటులు ఇలా వెళ్ళిపోతుంటే కొంత మంది నటులు మాత్రం ఇంకా ఆలోచిస్తున్నారట. ఎందుకు ఈ హీరోయిన్లు (Heroines in Bollywood) ధైర్యంగా ముందుకు వెళ్లట్లేదు అని అంత మాట్లాడుకుంటున్నారు. లేడీ పవర్ స్టార్ అనే పేరు ని తెచ్చుకున్నారు సాయి పల్లవి. సాయి పల్లవి తన డాన్స్ తో నటనతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఈమె ఇంతలా అందర్నీ ఆకట్టుకుంటున్నాను కానీ నార్త్ వైపు మాత్రం ఈమె అసలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు.
బాలీవుడ్ (Bollywood) మూవీ ఈమె చేయబోతున్నారు. అందుకనే ఈమె సౌత్ సినిమాలు వైపు చూడట్లేదని అంటున్నారు. కానీ బాలీవుడ్ లో కనపడలేదు. సమంత (Samantha) కూడా నార్త్ లో ఇప్పటి వరకు సినిమా చేయలేదు ఆల్రెడీ చూస్తున్న ఫ్యామిలీ మెన్ 2 సిటాడల్ వెబ్ సిరీస్ మాత్రమే ఉన్నాయి. పక్క కమర్షియల్ మూవీ లో సామ్ ని చూడాలని చాలామంది అనుకుంటున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా సమంతని చూడాలని అనుకుంటున్నారు.
ఇక కీర్తి సురేష్ (keerthi suresh) విషయానికి వస్తే ఈమె ఒప్పుకున్నట్టే ఒప్పుకొని సైడ్ అయిపోయింది. అయితే బాలీవుడ్ లో మైదాన్ తో కీర్తి సురేష్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ ఆమె సైడ్ అయిపోయారు. అనుష్కకి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది సౌత్ హీరోయిన్లలో అనుష్క అంటే తనకు అభిమానమని రన్బీర్ కపూర్ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు.
బాహుబలి లో దేవసేనగా ఉత్తరాది జనాలు మెప్పు పొందింది అనుష్క (Anushka shetty). అయినా కూడా ఒక్కసారి కూడా ఆమె బాలీవుడ్ వైపు వెళ్లట్లేదు నియర్ ఫ్యూచర్ లో ఆమె సైన్ చేస్తే చూడాలని అనుకున్నారు. మరి వీళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తే వీళ్ళ ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది కదా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మరి ఈ హీరోయిన్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.