Priyamani: నటి ప్రియమణి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రియమణి మనందరికీ పరిచయమే. ప్రియమణి చాలా సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. సుదీర్ఘకాలం నుండి ఫిలిం ఇండస్ట్రీలోని కొనసాగుతున్న నటి ప్రియమణి జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ప్రియమణి (Priyamani) అసలు ప్రియా వాసుదేవ్ మణీ అయ్యర్ బిఏ పూర్తి చేసిన తర్వాత నటన పై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీ లోకి రావడం మొదలుపెట్టింది.

2003లో ఎవరే అతగాడు సినిమాతో ఈమె సినిమాల్లోకి వచ్చింది పెళ్లయిన కొత్తలో సినిమాతో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్ళిపోయింది ప్రియమణి. అగ్ర హీరోలకి మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఈమె మారిపోయింది తెలుగు తో పాటుగా మలయాళ కన్నడ హిందీ తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
పెళ్లి తర్వాత నటనకి బ్రేక్ ఇచ్చింది కానీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ని షురూ చేసింది తాజాగా ప్రియమణి జవాన్ సినిమాలో నటించిన కింగ్ కాన్ షారుక్ ఖాన్ హీరోగా అట్లీ (atlee) దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాలో ప్రియమణి కనపడి ఆకట్టుకుంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార షారుక్ ఖాన్ కి జత కట్టింది.
ప్రియమణి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించింది యాక్టింగ్ కి మంచి స్కోప్ ఉన్న పాత్ర రావడంతో ప్రేమని అదరగొట్టేసింది. డైరెక్టర్ అట్లీ నన్ను దారుణంగా మోసం చేశాడని ఆమె చెప్పింది సినిమా రిలీజ్ కి ముందు జవాన్ మూవీ తమిళ వెర్షన్ లో దళపతి విజయ్ తెలుగు వర్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్ ప్లే చేస్తారని ప్రచారం జరిగింది. డైరెక్టర్ అట్లీ ని ఆమె ఈ విషయం అడిగితె.. అవును అని చెప్పారట దాంతో ప్రియమణి హీరో విజయ్తో తనకి ఒక షార్ట్ అయినా పెట్టమని అడిగిందట. అట్లీ మాట ఇచ్చారు కానీ అలా కుదరలేదు ఇద్దరూ కూడా జవాన్ సినిమాలో నటించలేదు.