A Driver Cheated Actress Jayalalitha
Actress Jayalalitha : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చాలామంది.. స్వతహాగా కష్టపడి పైకి వస్తే… మరి కొంతమంది తమ బ్యాగ్రౌండ్తో పైకి వచ్చినవారు ఉన్నారు. ఇది ఇలా ఉండగా చాలా కష్టపడి ఇండస్ట్రీలో పైకి వచ్చిన వారిలో నటి జయలలిత ఒకరు. జయలలిత అని పేరు చెప్పగానే.. మొదట అందరికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు మాత్రమే గుర్తుకు వస్తారు.
కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా సీనియర్ నటి జయలలిత ఉంది. 58 సంవత్సరాలు ఉన్న జయలలిత ఏపీకి చెందిన మహిళ. ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల, లారీ డ్రైవర్, ఇంద్రుడు చంద్రుడు, రాజకుమారుడు, ఖైదీ బ్రదర్స్, నేను పెళ్లికి రెడీ లాంటి ఎన్నో సినిమాలు చేసింది నటి జయలలిత.

దాదాపు మన తెలుగు చిత్ర పరిశ్రమలో 100 సినిమాలకు పైగా నటించింది నటి జయలలిత. అయితే ఈ వంద సినిమాలలో బోల్డ్, కామెడీ పాత్రలు చాలానే ఉన్నాయి. అప్పట్లో బోల్డ్ సినిమాలలో.. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ కూడా చేసేది ఈ నటి జయలలిత. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మహేష్ బాబు హీరోగా చేసిన భరత్ అనే నేను సినిమాలో స్పీకర్ పాత్రలో కనిపించి అందరినీ కన్విందు చేసింది నటి జయలలిత.
ఇది ఇలా ఉండగా తాజాగా తన కారు డ్రైవర్ మోజులో పడి… ఆస్తులను పోగొట్టుకుందట నటి జయలలిత. అనిల్ గణపతి రాజు అనే వ్యక్తి… జయలలిత దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసేవాడట. అయితే ఆ కారు డ్రైవర్తో నటి జయలలిత… కొన్నేళ్లు రిలేషన్ మైంటైన్ చేసిందట. ఈ నేపథ్యంలోనే ఆ డ్రైవర్…. నటి జయలలిత ( Actress Jayalalitha ) ఆస్తులను మొత్తం కాజేశాడట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.