Shruti Haasan :పబ్లిక్‌లో నేను చేయలేను.. నేను చాలా సున్నితం..!!

Shruthi Haasan

Shruthi Haasan

Shruti Haasan: నటి శృతిహాసన్ (Shruthi Haasan) గురించి పరిచయం చేయక్కర్లేదు. శృతిహాసన్ ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కమల్ హాసన్ కూతురుగా ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి తన నటన తో అందం తో అందరిని ఫిదా చేస్తూ ఉంది. శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని కూడా పంచుకుంటూ ఉంటుంది.

ఈ మధ్య కర్మఫలం అనుభవించాలి అంటూ ఆమె పోస్ట్ చేసింది. ఎవరు ఏమన్నారు కర్మఫలం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అభిమానులు ఆమెని అనేక రకాలుగా ప్రశ్నించారు. అయితే శృతిహాసన్ తన ప్రియుడుతో పాటుగా చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంది. తాజాగా తన అభిమానంతో శృతిహాసన్ కొన్ని విషయాలని పంచుకుంది నెటిజెన్స్ అడిగిన ప్రశ్నల కి ఆన్సర్లు చెప్పింది.

ఇందులో కొన్ని పర్సనల్ విషయాలు గురించి కూడా ఆమె మాట్లాడింది. ఎప్పటిలానే నీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఆమెకి వచ్చింది దీనికి శృతిహాసన్ చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చింది ఇది చాలా బోరింగ్ క్వశ్చన్ అని ఆమె మూతి తిప్పేసుకుంది. నువ్వు ఏడుస్తావా అని ఒక ప్రశ్న ఆమెని అడగగానే.. చాలా సున్నితమైన వ్యక్తిని కానీ పబ్లిక్ లో ఏడవను.

అది నాకు నచ్చదు సినిమాల్లో ఏ ఎమోషన్స్ చూసినా కూడా ఏడ్చేస్తూ ఉంటాను అని శృతిహాసన్ షేర్ చేసుకుంది చిన్నప్పుడు ఏ జాబ్ చేయాలని మీరు అనుకున్నారని ప్రశ్నకి బట్టల షాపులో సేల్స్ గర్ల్ అని ఆన్సర్ ఇచ్చింది. అటువంటి ఆలోచనలే నాకు చిన్నప్పుడు ఉండేవని శృతిహాసన్ పంచుకుంది.