Neha shetty: నటి నేహా శెట్టి (Neha shetty) గురించి చెప్పక్కర్లేదు. ఈమె ఇప్పటికే మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్ర చూసి రాధిక గా పాపులర్ అయిపోయింది. అనుకున్నంత మాత్రాన హీరోయిన్లు అంత స్పీడుగా సెటిల్ అయిపోలేరు. అవకాశాలు కూడా ఎక్కువగా రావు పైగా కొన్ని సినిమాలు చేసే వరకు కూడా పాపులారిటీని సంపాదించుకోవడం కష్టమే.
కానీ రాధిక పాత్రతో నేహా శెట్టి అందరినీ బాగా అలరించి ఫేమస్ అయిపోయింది. నేహా కి ఇప్పుడు అవకాశాలు కూడా బానే వస్తున్నాయి. నేహా శెట్టి ఫోటోలకి ఫిదా అయిపోయి నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నేహా ఫోటోలు ప్రస్తుతం కొన్ని వైరల్ అవుతున్నాయి కర్ణాటకలోని మంగుళూరులో నేహా శెట్టి పుట్టింది. ఆ తర్వాత మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో 2014లో మిస్ మంగుళూరుగా ఈమె ఎంపికయింది.
2016 లో దర్శకుడు శశాంక్ తీసిన ముంగారు మగాడు 2 అనే కన్నడ సినిమాలో ఈమె నటించింది ఆ సినిమా తర్వాత ఈమెకి నెమ్మదిగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన మెహబూబా సినిమాలో నటించి ఈమె టాలీవుడ్లోకి వచ్చింది.
తర్వాత ఈమెకి డీజే టిల్లు సినిమాలో అవకాశం వచ్చింది. వరుస సినిమా ఆఫర్లతో బిజీ గా వుంది ఈ బ్యూటీ. చీర లో ఈమె చాలా అందంగా వుంది. ప్రస్తుతం ఈమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈమె ఫోటోలను చూశారంటే కచ్చితంగా చూపు తిప్పుకోలేరు.