Samantha Ruth Prabhu And Naga Chaitanya’s Wedding Photo Viral
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు అక్కినేని నాగచైతన్య జంట గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. సమంత మరియు నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ… ఈ జంట కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏ మాయ చేసావే సినిమా సమయంలో… అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత ప్రేమలో పడ్డారు.
ఏ మాయ చేసావే సినిమాలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ సినిమాలో అనేక గొడవల తర్వాత వారి వివాహం జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2017 సంవత్సరంలో నాగచైతన్య మరియు సమంత వివాహం చేసుకున్నారు.

అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన అక్కినేని నాగచైతన్య మరియు సమంత 2021 సంవత్సరం డిసెంబర్ మాసంలో విడాకులు తీసుకొని తెలుగు ప్రేక్షకులకు కాకుండా… దేశవ్యాప్తంగా ఉన్న అక్కినేని ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలో హీరోయిన్ సమంత ఇంస్టాగ్రామ్ పేజీలో నాగచైతన్యతో ఉన్న ఫోటో వైరల్ గా మారింది. అందులో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్న సమంత ( Samantha )… అక్కినేని నాగచైతన్యకు ముద్దు పెడుతూ కనిపించింది. ఈ ఫోటో వైరల్ కావడంతో వీరిద్దరు మళ్ళీ కలుస్తున్నారా ? అని అందరూ చర్చించుకుంటున్నారు.