Ileana: ఈ ఫొటోలో చిన్నారి.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మీరు గుర్తు పట్టారా..?

ileana: అప్పుడప్పుడు హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటాయి. ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఫొటోస్ ని పంచుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈమె ఒకప్పుడు. ఈమె ఎవరో మీరు గుర్తుపట్టారా..? ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఒకప్పుడు మంచి టాలీవుడ్ హీరోయిన్. అగ్ర హీరోల పక్కన కూడా నటించింది.

ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో కూడా ఈమె తన అందంతో అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. తన ఫస్ట్ సినిమాకే పాపులారిటీని బాగా సంపాదించుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో బిజీగా ఉంటోంది. ఎన్టీఆర్ అల్లు అర్జున్ తో కూడా ఈమె నటించింది. తల్లిగా ఈ మధ్య ప్రమోషన్ పొందింది.

ఇక ఎవరో మీరు గుర్తుపట్టారా లేదా ఎవరో కాదు ఈ ముద్దుగుమ్మ ఇలియానా. 2006లో దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఇలియానా.. తర్వాత ఈమెకి వరుస ఆఫర్లు వచ్చాయి. చాలామంది హీరోలు పక్కన నటించింది. మహేష్ బాబు పక్కన పోకిరి సినిమాలో చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది ఆ తర్వాత పలు చిత్రాల్లో ఈమెకి అవకాశాలు వచ్చాయి.

తమిళ్ లో కూడా నటించింది. 2012లో బర్ఫీ సినిమాతో ఈమె బాలీవుడ్లోకి అడుగు పెట్టింది సౌత్ లో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకుంది ఇలియానా. ఈమధ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఇలియానా. ఇలియానా చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు ఎవరో గుర్తుపట్టారా అంటూ ఫోటోలని విపరీతంగా షేర్ చేస్తున్నారు.